epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మరో వరల్డ్ రికార్డ్‌కు చేరువలో బాబర్ ఆజమ్

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) మరో రికార్డ్‌కు చేరువలో ఉన్నాడు. బిగ్ బాష్​ లీగ్(BBL) 15లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్న ఆజమ్ టీ20 క్రికెట్‌లో మరో చారిత్రక రికార్డు చేరుకోనున్నాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‍ పేరుపై ఉన్న అత్యధిక 50+ స్కోర్ల రికార్డును బద్దలు కొట్టే దిశగా బాబర్ అడుగు వేస్తున్నాడు. సీజన్ ప్రారంభంలో తడబడిన బాబర్.. సిడ్నీ థండర్స్​తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. 42 బంతుల్లో 58 పరుగులు చేసి తన తొలి బీబీఎల్ అర్ధ శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

అనంతరం గురువారం మెల్​బోర్న్​ రెనెగ్రేడ్స్​తో జరిగిన మ్యాచ్​లో మరోసారి హాఫ్​ సెంచరీ(58 నాటౌట్​; 46 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్​) చేశాడు. ఈ హాఫ్​ సెంచరీతో బాబర్ టీ20ల్లో 107వ సారి 50+ స్కోరు సాధించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (121), విరాట్ కోహ్లీ (114), క్రిస్ గేల్ (110) ముందున్నారు. గేల్ రికార్డును అధిగమించడానికి బాబర్‌ ఆజమ్ (Babar Azam) కు ఇంకా నాలుగు అర్ధశతకాలు మాత్రమే అవసరం. కాగా, ఈ మ్యాచ్​లో తొలుత మెల్​బోర్న్​ 164/9 స్కోరు చేయగా, అనంతరం సిడ్నీ సిక్సర్స్​ 19.1 ఓవర్లలో 168/4 చేసి గెలుపు అందుకుంది.

Read Also: BPL వేదికల నుంచి చట్టోగ్రామ్ ఔట్.. కారణం ఏంటో తెలుసా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>