మసీదులో బాంబు పేలుడు.. 50 మంది మృతి

కలం, వెబ్​డెస్క్​: మసీదులో శక్తిమంతమైన బాంబు పేలి 50 మంది చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్​ రాజధాని ఇస్లామాబాద్​లో (Pakistan Blast) జరిగింది. దీంతో అప్రమత్తమైన పాక్​ ప్రభుత్వం నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్​లోని షెహజాద్​ టౌన్​ ఏరియాలో ఉన్న తర్లాయ్​ ఇమామ్​బర్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఒక్కసారి బాంబు పేలింది.

దీంతో ప్రార్థనకు వచ్చినవాళ్లలో పదుల సంఖ్యలో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన పోలీసులు, వైద్య సిబ్బంది వచ్చేసరికి ఘటనాస్థలం రక్తపు మరకలు, ఛిద్రమైన శవాలు, పొగతో నిండిపోయి ఉంది. గాయపడిన వాళ్లను హుటాహుటిన పాకిస్థాన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (PIMS) అండ్​ పాలీక్లినిక్​ హాస్పిటల్​లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరికొందరు మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 50 మంది చనిపోయారని, దాదాపు 30 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

బీఎల్​ఏ ఆత్మాహుతి దాడి?

బాంబు పేలుడు (Pakistan Blast) ఘటనను ఆత్మాహుతి దాడిగా పోలీసులు చెబుతున్నారు. దీనికి బలూచిస్థాన్ లిబరేషన్​ ఆర్మీ(బీఎల్​ఏ)నే కారణమంటున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా ఆధారాలు దొరికాయని, మరింత దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు గత ఏడాది నవంబర్​లోనూ ఇస్లామాబాద్​లో ఇలాగే బాంబు పేలుడు జరిగి 12 మంది మృతి చెందగా, మరో 27 మంది గాయపడ్డారు. ఇది బీఎల్​ఏ ఆత్మాహుతి దాడి పనే అని అప్పట్లో పాక్​ ఆరోపించింది.

కాగా, వారం నుంచి బలూచిస్థాన్​లో బీఎల్​ఏ దళాలకు పాక్​ సైన్యానికి మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరువైపులా ఇప్పటికే 300 మంది దాకా చనిపోయారు. తమ మహిళలు కొందరు ఆత్మాహుతి దాడులు చేసినట్లు ఇటీవల సోషల్​ మీడియా వేదికగా బీఎల్​ఏ వీడియోలు విడుదల చేసింది. పాకిస్థాన్​ నుంచి స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బీఎల్​ఏ.. గత ఏడాది హెరోఫ్​1 పేరుతో బలూచిస్థాన్​ (Balochistan) ప్రావిన్స్​లో దాడులు చేసింది. ఇప్పుడు వారం నుంచి హెరోఫ్​2 పేరుతో మరోసారి విరుచుకుపడుతోంది.

Read Also: 96 ఏళ్ల వయసులో భరతనాట్యంలో అదరగొట్టిన బామ్మ.. వీడియో వైరల్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>