కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారంలో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులపై (Mallareddy Supporters) దాడి జరిగింది. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. లాల్ గడి మలక్‌పేట్ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులతో మాట్లాడుతుండగా.. డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాటలను ఎక్కువ సౌండ్ పెట్టి ప్లే చేశాడని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడంతో ఘర్షణ చెలరేగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మల్లారెడ్డి అనుచరుడు (Mallareddy Supporters) ఢిల్లీ పరమేశ్ తలకు గాయాలయ్యాయి. డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ నేతృత్వంలోనే దాడి జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: సిటిజన్ సెంట్రిక్ సిస్టమ్.. ఇంటి వద్దే ఫిర్యాదు నమోదు
Follow Us On: X(Twitter)


