కలం, వెబ్ డెస్క్: వృద్దాప్యం అనేది శరీరానికే కానీ.. మనసుకు కాదు అని చాటిచెప్పింది ఓ బామ్మ. చెన్నై (Chennai)లో నిర్వహించిన ‘ముదియార్ తిరువిళా’ కార్యక్రమంలో బామ్మ అద్భుతంగా భరతనాట్యం చేసి ఆశ్చర్యపర్చింది. 96 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తడబడకుండా, ఎంతో ఉత్సాహంగా భరతనాట్యం చేసి ఆకట్టుకుంది. సంగీతానికి అనుగుణంగా ఆమె వేసిన డ్యాన్స్, ముఖంలో పలికించిన హావభావాలు మెస్మరైజ్ చేశాయి.
ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ఉత్సాహాన్ని చూసి వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. “వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ బామ్మ నిరూపించారు” అంటూ కామెంట్లు చేశారు. ఈ బామ్మ ఈతరానికి స్ఫూర్తిదాయకమని తమ రియాక్ట్ అవుతున్నారు.
శాస్త్రీయ నృత్యంలో అదరగొట్టిన బామ్మ
ఆమె హావభావాలకు ఫిదా అవుతున్న జనం
డ్యాన్స్ కు వయసుతో సంబంధం లేదని నిరూపించిన బామ్మ
చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వృద్ధురాలు తన నృత్యంతో ఔరా అనిపించారు96 year old paati dances very gracefully in an event of Mudhiyor Thiruvizha (ముదియార్… pic.twitter.com/HUbG0Qclbp
— Kalam Daily (@kalamtelugu) February 6, 2026
Read Also: మసీదులో బాంబు పేలుడు.. 50 మంది మృతి
Follow Us On : WhatsApp


