టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం.. టీవీ పగులగొట్టిన ఫ్యాన్, వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఓ పాక్ అభిమాని తన బాధను తట్టుకోలేక టీవీని పగులగొట్టాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

మ్యాచ్ ముగిసిన వెంటనే ఓ అభిమాని “భారత్ చేతిలో పాకిస్థాన్ మళ్ళీ ఓడిపోయింది. నా ఫ్రస్ట్రేషన్‌ను తట్టుకోలేక టీవీ పగులగొట్టా” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొందరు అభిమానులు సైతం పాక్ జట్టు ఆటతీరుపై మండిపడుతున్నారు.

కొలంబో వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, చిరకాల ప్రత్యర్థిపై తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, ఇషాన్ కిషన్ (Ishan Kishan) మెరుపు హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ (Pakistan) భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. వరుసగా వికెట్లు కోల్పోతూ పాక్ జట్టు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Read Also: కొలంబోలో మనోళ్లు కుమ్మేశారు.. పాక్​ను చిత్తు చేసిన భారత్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>