తిమ్మాపూర్ వద్ద రైతుల ధర్నా.. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా (Siddipet District) దుబ్బాక మండలం తిమ్మాపూర్ (Thimmapur) వద్ద NH 765DG హైవేపై పెద్దగుండవెల్లి గ్రామ రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతోందని, వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు జరగలేదని, అలాగే ధాన్యం తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరతను వెంటనే తీర్చాలని వారు ఆందోళన చేపట్టారు. రైతుల ధర్నా కారణంగా హైవేపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read Also: లాజిస్టిక్స్ హబ్‌గా హైదరాబాద్‌.. కార్గో టెర్మినల్ 2 ప్రారంభం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>