Mobile Popup Ad
Mobile Popup Ad

ఎబోలా కలకలం.. ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు పెంచిన అమెరికా

కలం, వెబ్ డెస్క్: ఆఫ్రికాలో (Africa) అమెరికన్ పౌరుడికి ప్రాణాంతక ఎబోలా (Ebola) వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ప్రయాణ ఆంక్షలను ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా దేశ సరిహద్దుల లోపల ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా భాగంగానే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా, తనిఖీలను కఠినతరం చేసినట్లు పేర్కొన్నారు.

బాధిత అమెరికన్ పౌరుడు ఆఫ్రికాలో ఎబోలా (Ebola) బారిన పడినట్లు గుర్తించడంతో తగిన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి చెందిన సమయంలో కూడా అమెరికా ఆరోగ్య శాఖ కఠినమైన నిబంధనలను అమలు చేసింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందకుండా ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు, వైరస్ ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

Read Also: పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ రివ్యూ.. నేతలకు కీలక సూచనలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>