కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ జలమండలి జీఎం (Water Board GM) కుమార్ నివాసం, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో విస్తృత సోదాలు (Raids) నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఎండీకి హైదరాబాద్‌లో 3 విలాసవంతమైన ఫ్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లతో పాటు నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల విలువైన భూమి ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు సుమారు రూ. 100 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, ఒక కిలో బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు, ఈ సోదాల్లో మరిన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరోవైపు ఏడు గంటలుగా సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జలమండలి మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ ఇంట్లో ఎసీబీ సోదాలు (ACB Raids) జరిపారు. అలాగే మల్లాపూర్ తో పాటు బంధువుల నివాసాల్లో సోదాలు జరిపి 2 రిట్జ్ కార్లతోపాటు ఇతర కార్లను సీజ్ చేశారు.
Read Also: లాజిస్టిక్స్ హబ్‌గా హైదరాబాద్.. కార్గో టెర్మినల్ 2 ప్రారంభం
Follow Us On: WhatsApp

