జానకి లాంటి సింగర్ మళ్లీ పుట్టదు: పి. సుశీల

కలం, వెబ్ డెస్క: ప్రముఖ సింగర్ జానకి (Singer S Janaki) మృతిపై గాయని పి.సుశీల (P Susheela) తీవ్ర భావోద్వేగం చెందారు. ఆమెలా ఏ పాట అయినా అవలీలగా పాడగలిగే సింగర్ ఇక మళ్లీ పుట్టబోరని తెలిపారు. మద్రాసులో పర్వతం లాంటి ఇద్దరు గాయకులు (ఎస్పీ బాలు, జానకి) ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆయన, ఇప్పుడు ఆమె వెళ్లిపోయిందని ఆవేదన చెందారు. జానకి, తనకు మధ్య కొందరు గొడవలు సృష్టించి, ఏడిపించారని.. ఇప్పుడు వారి కళ్లు చల్లబడుతాయా.. అన్నారు.

ఆమె గొంతు అద్భుతం..

తాను చిన్న చిన్న పాటలు పాడే సమయంలోనే.. జానకి (Singer S Janaki) అన్ని రకాల పాటలు పాడేదని సుశీల గుర్తు చేసుకున్నారు. ఆమె గొంతు అద్భుతమని.. సరస్వతి దేవి పక్కన ఉందా.. అనిపించేదన్నారు. పాటతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవడం ఆమెకు తెలిసినంతంగా ఎవరికీ తెలియదన్నారు. జానకి పాడుతుంటే తాను ఉత్సవ విగ్రహంలా ఉండిపోయేదాన్ని.. అని కంటనీరు పెట్టుకున్నారు.

ఇంకా సుశీల వీడియోలో ఏం మాట్లాడారో ఈ లింకులో చూడొచ్చు..👇

Read Also: జానీ, శేఖర్ మాస్టర్స్ గ్రూప్స్ మధ్య ఘర్షణ.. ఏమైందంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>