కలం, వెబ్ డెస్క్: తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తంగా మారింది. ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వర్గాల (Jani Master vs Sekhar Master Groups) మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అసోసియేషన్ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అసోసియేషన్ ఎన్నికలు, అంతర్గత పరిపాలన, సభ్యత్వాల నమోదు, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడంతో పరిస్థితి హీటెక్కింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఫిల్మ్ అసోసియేషన్ (Telugu Film Dancers Association)లో కొన్ని అంశాలపై ఇటీవల జానీ మాస్టర్ వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సభ్యులు సైతం రెండు వర్గాలుగా విడిపోయి తమ లీడర్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ వివాదంలో జానీ మాస్టర్ భార్య, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత పేరు కూడా చర్చనీయాంశంగా మారింది. అసోసియేషన్ వ్యవహారాల్లో ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫెడరేషన్ అనుమతి లేకుండానే మధ్యంతర ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయని.. ఈ పరిణామాలతో అసోసియేషన్‌కు చెందిన దాదాపు 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జానీ మాస్టర్ Vs శేఖర్ మాస్టర్..!
-డ్యాన్స్ అసోసియేషన్‌లో చెలరేగిన వివాదం..
-కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య ఘర్షణ!
-అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలతపై డ్యాన్సర్స్ ఫైర్
-ఫెడరేషన్ పర్మిషన్ లేకుండా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధమైన… pic.twitter.com/UGTwJ923a0— Kalam Daily (@kalamtelugu) July 12, 2026

