ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో గోదావరి హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకున్నది. కల్తీ ఆహారం పెడుతున్నారని విద్యార్థులు నిరసన తెలిపారు. హాస్టల్‌లో ఇస్తున్న ఆహారం నాణ్యత లేకుండా ఉందని, రుచిలేకుండా ఉందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులు ఫుడ్ కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, “ఆహారం నచ్చకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీనిపై విద్యార్థులు తీవ్రంగా స్పందించి హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు.
విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను కలసి, నాణ్యతలేని ఆహారం పెడుతున్న కాంట్రాక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, హాస్టల్‌లలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం యూనివర్సిటీ(Osmania University) అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, విద్యార్థుల ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Also: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ తేదీలోపు ఎన్నికలు జరగుతాయా?
Follow Us On : Instagram

