ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాయి. వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో ఎనుమాముల మార్కెట్(Enumamula Market)లోకి తీసుకువచ్చిన పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా వర్షం పడడంతో పంటను షెడ్ల కిందకు తరలించే అవకాశం లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వర్షం కారణంగా వేల క్వింటాళ్ల పత్తి, మొక్కజొన్న పంట తడవడంతో రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇప్పటికే పంట కోత ఖర్చులు, రవాణా వ్యయాలు భరించి మార్కెట్‌కి తీసుకువచ్చిన రైతులు ఇప్పుడు నష్టపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తడిసిన పంటను మార్కెట్‌లో కొనుగోలు చేయరని భయం రైతులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా తడిసిన పంటను కూడా కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయమైన ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
రైతులు తమ కష్టానికి గట్టి మద్దతుగా వ్యవసాయ శాఖ, మార్కెట్(Enumamula Market) అధికారులు ముందుకు రావాలని, ఇలాంటి పరిస్థితులు రాకుండా తగిన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
Read Also: ఓయూలో ఉద్రిక్తత.. కల్తీ ఆహారంపై విద్యార్థుల ఆగ్రహం
Follow Us On : Instagram

