కలం, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)ని కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించడంపై లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి శాలువాతో ప్రధానిని సత్కరించారు. ఎక్స్ వేదికగా లోకేశ్ ప్రధానికి కలిసిన ఫోటోలు పంచుకుంటూ ఓ పోస్ట్ చేశారు. తమ భూములను త్యాగం చేసి, ఏళ్ల తరబడి పోరాడిన రైతుల స్ఫూర్తిని ప్రధానికి లోకేశ్ వివరించారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆయన మార్గనిర్దేశం అందించాలని కోరారు.
ప్రధానితో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును నారా లోకేశ్ కలిశారు. బిల్లు ఆమోదానికి సహకరించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రైతుల ధైర్యసాహసాలకు దక్కిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసిందని, అమరావతి నిర్మాణంలో ఈ బిల్లు అత్యంత కీలకమని లోకేశ్ వెల్లడించారు. అమరావతి బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్ర రైతుల పక్షాన నిలబడిన ఎన్డీయే ఎంపీలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందించారు.
Read Also: వైసీపీ పాలనలో ఏపీలో చీకటి రోజులు: రామ్మోహన్ నాయుడు
Follow Us On: Instagram

