ఢిల్లీలో అఖిలపక్ష భేటీ.. విపక్ష పార్టీల వాకౌట్.. ఏమైందంటే?

కలం, వెబ్ డెస్క్: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుతం అఖిలపక్ష సమావేశం (Delhi All Party Meeting) ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన చేపట్టిన ఈ భేటీలో అధికార సభ్యులతోపాటు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. అయితే మీటింగ్ ప్రారంభం అయిన కొద్దిసేపటికే హైడ్రామా చోటుచేసుకుంది. 20 మంది తిరుగుబాటు ఎంపీలకు కేంద్రం ఎలా ఆహ్వానం పంపుతోందని టీఎంసీ (TMC) పార్టీ నేతలు ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. తిరుగుబాటు ఎంపీల విలీనానికి స్పీకర్ ఇంకా ఆమోదం తెలపలేదని.. ఈ ఎంపీలకు ఆహ్వానం పంపడాన్ని నిరసిస్తూ సమావేశం నుంచి టీఎంసీ సభ్యులు వాకౌట్ అయ్యారు. టేబుల్ ఆఫీస్ జాబితాలో టీఎంసీ బలం ఇప్పటికీ 28 మంది సభ్యులుగానే ఉందని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా మండిపడ్డారు. 91వ రాజ్యాంగ సవరణ తర్వాత ప్రత్యేక కూటమికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

అటు అఖిలపక్ష సమావేశానికి (Delhi All Party Meeting) టీఎంసీ తిరుగుబాటు ఎంపీలను ఆహ్వానించడాన్ని విపక్ష నేతలు సైతం తీవ్రంగా ఖండించాయి. లోక్‌సభలో వారికి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయడం, స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే వారికి గుర్తింపు కల్పించేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించాయి. ఈ సందర్భంగా శివసేన(యూబీటీ) తిరుగుబాటు ఎంపీల విలీన అంశాలపై వారు ప్రశ్నించారు.

అలాగే దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో (NEET Exam) అక్రమాలు, ఇతర ప్రశ్నపత్రాల లీకేజీలు, వాంగ్‌చుక్ నిరసన, అయోధ్యలో విరాళాల చోరీ తదితర అంశాలపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే సభలో గందరగోళం తలెత్తగా.. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, జేఎంఎం, ఆప్, వామపక్షాలు, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన( యూబీటీ) పార్టీలు వాకౌట్ చేశాయి. వాకౌట్ అనంతరం కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా వాకౌట్ చేశాని చెప్పుకొచ్చారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC)కి చెందిన సుమారు 20 మంది తిరుగుబాటు ఎంపీలు జూన్ నెలలో ఎన్సీపీలో విలీనం అయినట్లు ప్రకటించారు. అయితే ఈ విలీనాన్ని లోక్ సభ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. అఫీషియల్ గా ఆమోదం తెలుపకుండా సమావేశానికి రెబెల్ ఎంపీలను ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్​ బాబు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>