జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాకు ప్రతిపక్షాల ఉద్యమం

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని దేశ వ్యాప్తంగా భారీ ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దాదాపుగా నిర్ణయించుకున్నాయి. ఈ నెల 30న ఇండియా కూటమి నేతల కీలక సమావేశం జరగబోతుంది. ఆందోళనలకు సంబంధించిన ప్రణాళికలపై నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఈ భేటీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సహా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఇతర పార్టీల అగ్ర నేతలను కూడా ఆహ్వానించారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో సంబంధం లేకుండానే జ్ఞానేష్ కుమార్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నాయి. ఢిల్లీలో జరగబోతున్న ఈ భేటీలో సీఈసీతో పాటు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

అభిశంసన తీర్మానంపై చర్చ..

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌‌(Gyanesh Kumar)ను తొలగించేందుకు పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ఇందుకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో అంతర్గతంగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ఎంపీల సంతకాలు పూర్తయ్యాక.. తీర్మానాన్ని స్పీకర్‌కు అందజేసే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే పార్లమెంటులో జ్ఞానేష్ కుమార్‌‌పై అభిశంసన తీర్మానం ఒకటి పెండింగులో ఉంది. మెజార్టీ లేని కారణంగా ప్రతిపక్షాలు పెట్టిన తీర్మానం చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు మరోసారి తీర్మానం పెడితే ఎలా ఉంటుందనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. అభిశంసన కంటే ఆయన్నే రాజీనామా చేసేలా ఒత్తిడి పెంచడం మేలని ప్రతిపక్షాల్లో మరో వర్గం భావిస్తోంది.

Also Read : సింధు దూకుడు.. ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>