కలం వెబ్ డెస్క్ : నేటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు(National Road Safety Month) ప్రారంభం కానున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు , రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి జనవరి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతాయని, తెలంగాణలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, పౌరులంతా పాల్గొనాలని కోరారు.
ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి తాను రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తానని, తమ తల్లిదండ్రుల దగ్గర సంతకాల సేకరణకు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలోని ప్రతి పాఠశాలలో రోడ్ సేఫ్టీ క్లబ్స్(Road Safety Clubs) ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో రోడ్ సేఫ్టీపై అప్రమత్తంగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలంగాణలో అనేక ప్రమాదాలు, మరణాలు రోడ్డు ప్రమాదాల వలనే అవుతున్నాయని పోలీస్ అధికారులు చెప్పారన్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి రోడ్డు నిబంధనలు పాటించాలని రవాణా శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also: నేడు నుమాయిష్.. సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
Follow Us On: Pinterest


