కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) , స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ‘డ్రాగన్’ అనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతుంది. మైత్రీ మూవీమేకర్స్ (Mythri Movie Makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ పూర్తిగా మార్చుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడిండంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ లుక్ అంత ఇంటెన్సివ్‌గా లేకపోవడంతో కొత్త లుక్ కోసం సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అయింది.
అయితే ఈ వార్తలను ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) టీం ఖండించింది. సినిమా లుక్‌కు సంబంధించి.. షూటింగ్ షెడ్యూల్ రద్దు అయ్యిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. సినిమా యథావిధిగా ప్లాన్ ప్రకారమే కొనసాగుతోందని, ప్రస్తుతం కేవలం సాధారణ ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు పూర్తిగా అసత్యమని పేర్కొంది. అలాంటి వార్తలను నమ్మవద్దని, ఎవరికి షేర్ చేయవద్దని ప్రేక్షకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది. సినిమా గురించి అధికారిక అప్‌డేట్స్ అన్నీ తమ నుంచే వస్తాయని కూడా స్పష్టం చేసింది.
Read Also: ఆయా షేర్ సాంగ్ అదుర్స్.. నాని కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్
Follow Us On: X(Twitter)

