ఆయా షేర్ సాంగ్ అదుర్స్.. నాని కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్

కలం, వెబ్ డెస్క్: నాచురల్ స్టార్ నాని తన అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్, డాన్స్ స్టెప్స్‌తో ద పారడైజ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఈ చిత్రంలోని ఆయా షేర్ (Aaya Sher) సాంగ్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. నాని కెరీర్‌లోనే వేగంగా ఈ మైలురాయిని అందుకున్న పాటగా ఇది నిలిచింది. అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ ట్యూన్, నాని పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ అభిమానుల్లో సంచలనం రేపింది.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ పాటను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దగా, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో నిర్మించారు. ఈ చిత్రంలో నాని (Nani) జడల్ అనే ఊరమాస్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట రీల్స్, ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. మోహన్ బాబు, రాఘవ్ జుయల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కానుంది.

Read Also: ‘డ్రాగన్’ మూవీ రూమర్లకు చెక్.. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ క్లారిటీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>