కోహ్లీతో దోస్తీ.. భారత్‌కు రానున్న జకోవిచ్!

కలం, వెబ్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) క్రికెట్‌పై తనకున్న ఆసక్తికి అసలు కారణం విరాట్ కోహ్లీయేనని తేల్చి చెప్పారు. లారీయస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ వేదికగా కోహ్లీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. సెర్బియాలో క్రికెట్‌కు ఆదరణ లేకపోయినా, విరాట్ ఆట చూశాకే తాను ఈ క్రీడను ఫాలో అవ్వడం మొదలుపెట్టానని జకోవిచ్ వెల్లడించారు. కోహ్లీ తనకి మంచి స్నేహితుడని, అతని వ్యక్తిత్వం అంటే గౌరవమని జకోవిచ్ పేర్కొన్నారు. తామిద్దరం నిరంతరం టచ్‌లో ఉంటామని, త్వరలోనే భారత్‌లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.

ఆ పర్యటనలో కోహ్లీతో కలిసి టెన్నిస్, క్రికెట్ ఆడుతూ సందడి చేయాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టారు. భారత అభిమానుల మద్దతు మరువలేనిదని, త్వరలోనే అక్కడ ఒక ఈవెంట్ లేదా మ్యాచ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నానని జకోవిచ్ చెప్పారు. భారతీయులకు తాను చాలా దగ్గరని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే టెన్నిస్‌లో యువ ఆటగాళ్ల మధ్య పోటీ బాగున్నా, ‘బిగ్ త్రీ’ శకం ఎప్పటికీ ప్రత్యేకమని ఆయన (Novak Djokovic) వ్యాఖ్యానించారు. రెండు క్రీడా దేశాల దిగ్గజాల మధ్య ఉన్న ఈ అనుబంధం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: కేరళలో భారీ పేలుడు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>