కలం, వెబ్ డెస్క్ : అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ (CI Ashok)పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అశోక్ చేసిన అక్రమాలపై కర్నూలు (Kurnool) డీఐజీ కోయ ప్రవీణ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, ఉన్నతాధికారులు కొద్ది రోజుల క్రితమే ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
అశోక్ (CI Ashok) గతంలో ఎక్కడైతే విధులు నిర్వహించారో అదే పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో అశోక్‌తో పాటు రాజా సింగ్ అనే మరో వ్యక్తిని కూడా నిందితుడిగా చేర్చి, పలు సెక్షన్ల కింద విచారణ చేపట్టారు. గతంలో సికె దిన్నె, చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లలో సీఐగా పనిచేసిన సమయంలో అశోక్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. చట్టాన్ని రక్షించాల్సిన అధికారిపైనే నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: ఇరాన్ టు ఇండియా: రవాణా సవాల్
Follow Us On: X(Twitter)

