Mobile Popup Ad
Mobile Popup Ad

మా ఇండ్లు కూల్చొద్దు.. రాహుల్ గాంధీకి చిన్నారుల పోస్ట్ కార్డ్స్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: మూసీ ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా మూసీ (Musi) ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న మ‌ధుపార్క్ రిడ్జ్ (Madhu Park Ridge) అపార్ట్‌మెంట్‌ను కూల్చేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ అపార్ట్‌మెంట్ వాసుల‌కు ప్ర‌భుత్వం మ‌రో చోట భ‌వ‌న స‌ముదాయాన్ని నిర్మించి ఇస్తామ‌ని, లేదంటే బాధితుల‌కు డ‌బ్బులు చెల్లిస్తామ‌ని సూచించింది. అయితే అపార్ట్‌మెంట్ వాసులు దీనిపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా అపార్ట్‌మెంట్‌లో ఉండే చిన్నారులు మా ఇండ్లు కూల‌గొట్ట‌కండి అంటూ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి పోస్ట్ కార్డ్స్‌ రాశారు. సుమారు 1000కి పైగా పోస్టు కార్డులు రాసి నల్లటి రిబ్బన్ పై అతికించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు చిన్నారులు మాట్లాడుతూ.. త‌మ ఇల్లు కూల‌గొట్టి ఇక్క‌డ మ‌రో భ‌వ‌నం నిర్మించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం త‌మ ఇండ్లను వ‌దిలి, మూసీ ప్ర‌క్షాళ‌న‌పై దృష్టి సారించాల‌ని కోరుతున్నారు.

Read Also: అమెరికా మిత్ర దేశాలపైనా దాడులు.. ట్రంప్‌కు ఇరాన్ కౌంట‌ర్‌

Follow Us On: Facebook

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>