కలం, సెంట్రల్ డెస్క్ : ఇరాన్ (Iran) యుద్ధం కారణంగా క్రూడాయిల్, ఎల్పీజీకి విపరీతమైన కొరత ఏర్పడింది. దిగుమతులపై ఆధారపడే ఇండియా లాంటి దేశాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉంది. గల్ఫ్‌లోని ఆయిల్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేయడం, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా షిప్స్ రాకుండా అడ్డుకోవడంతో సిచ్యువేషన్ రోజురోజుకు దిగజారుతున్నది. కఠినమైన సవాళ్ల మధ్య ఇటీవల శివాలిక్, నందాదేవి షిప్స్ ఎల్పీజీ ట్యాంకర్లతో (LPG Tankers) ఇండియాకు చేరుకున్నాయి. సముద్రం గుండా రవాణా అంత ఈజీ కాదు. హర్మూజ్ నుంచి ముంబై తీరానికి, గుజరాత్ తీరానికి ట్యాంకర్లతో షిప్లు చేరుకోవాలంటే కనీసం 3 నుంచి 5 రోజులు పడుతుంది. యుద్ధం జరుగుతున్న టైమ్‌లో అది మరింత సవాలుతో కూడుకున్న జర్నీ. ఈ నేపథ్యంలో క్రూడాయిల్, ఎల్పీజీ ట్యాంకర్లను ఎలా తయారు చేస్తారు? ఆ ఉత్పత్తులను ఎంత జాగ్రత్తగా రవాణా చేస్తారు? సముద్రంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనే అంశాలపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: తెలంగాణకి మోదీ.. గ్రాఫ్ పెరిగేలా పొలిటికల్ స్కెచ్
Follow Us On: X(Twitter)

