Mobile Popup Ad
Mobile Popup Ad

కాలుష్యాన్ని పెంచుతున్న కంపెనీలను ORR బయటకు పంపిస్తాం : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై మాట్లాడారు. హైదరాబాద్, రాష్ట్రం రూపు రేఖలు మార్చడానికే క్యూర్, ప్యూర్, రేర్ విధానాన్ని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. కాలుష్యాన్ని పెంచుతున్న కంపెనీలను కచ్చితంగా ఓఆర్ఆర్ (ORR) బయటకు పంపిస్తామని స్పష్టం చేశారు. కాలుష్యం పెరిగిపోతే ఢిల్లీలో గాలి కూడా పీల్చలేని పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్ లో హైదరాబాద్ కు కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే ఇప్పుడు కంపెనీలను తరలిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. కంపెనీలను తరలిస్తే ఆ భూములను మల్టీ జోన్ లుగా వాడుకోవచ్చని సీఎం రేవంత్ వెల్లడించారు.

అలాగే మెట్రోను లాస్ట్ డెస్టినేషన్ దాకా నడుపుతామన్నారు రేవంత్ (Revanth Reddy). ‘ఏ నగరంలో అయినా మెట్రో ప్రాజెక్టు ఎయిర్ పోర్టుకు కనెక్ట్ చేసి ఉంటుంది. కానీ హైదరాబాద్ లో అలా లేదు. అందుకే మెట్రోను విస్తరిస్తామంటే ఎల్ అండ్ టీ సహకరించలేదు. కేంద్రం సూచనతో రాష్ట్ర ప్రభుత్వమే మెట్రోను స్వాధీనం చేసుకుంది. ఎయిర్ పోర్టుకు మెట్రోను విస్తరించడంతో పాటు.. పాతబస్తీలో మెట్రోను నిర్మించి అక్కడి ప్రజలకు న్యాయం చేస్తాం. రూ.24వేల కోట్లతో 72 కిలోమీటర్ల దాకా మెట్రోను నిర్మిస్తాం’ అని సీఎం రేంత్ వెల్లడించారు.

ఫుట్ పాత్ లపై ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని.. చిరు వ్యాపారులకు అవసరం అయితే వేరే చోట వ్యాపారం చేసుకునే వెసలుబాటు కల్పిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ‘నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్ లు నిర్మిస్తున్నాం. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే బేగంపేట ఎయిర్ పోర్టులో అండర్ పాస్ లను నిర్మిస్తున్నాం’ అన్నారు సీఎం రేవంత్.

మూసీ ప్రాజెక్టుతో పాటు ఎలివేటెడ్ కారిడార్ (Elevated Corridor) లు నిర్మిస్తామని రేవంత్ తెలిపారు. మూసీ ప్రాజెక్టును తాము కొత్తగా తీసుకురాలేదని.. బీఆర్ ఎస్ హయాంలో తీసుకొచ్చిన దాన్నే తాము కంటిన్యూ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ‘మూసీ ప్రాజెక్టు బీఆర్ ఎస్ హయాంలో వాళ్లకు నచ్చింది. కానీ ఇప్పుడు నచ్చట్లేదని చెప్పడం కరెక్ట్ కాదు. గుజరాత్ లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్ పార్టీ సహకరించింది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలి’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.

Read Also: ప్రతి సమస్యనూ మేం మానవీయ కోణంలోనే చూస్తాం: భట్టి

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>