ట్రంప్ పాల‌న‌పై భ‌గ్గుమ‌న్న అమెరిక‌న్లు.. దేశ వ్యాప్తంగా భారీ నిర‌స‌న‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప‌రిపాల‌న తీరుకు వ్య‌తిరేకంగా ఆ దేశ ప్ర‌జ‌లు నిర‌స‌న‌ల‌కు దిగారు. నో కింగ్స్ పేరిట దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్య‌మం (No Kings Protests) జ‌రుగుతోంది. అమెరికాలోని మిన్నెసోటా ఈ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. వీటిలో మొత్తం 90 ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌జ‌లు పాల్గొన్న‌ట్లు స‌మాచారం. లాభాల కోసం యుద్ధం చేస్తున్నారా? అంటూ ప్ర‌జ‌లు ట్రంప్‌ను నిల‌దీస్తున్నారు. అమెరికా సైనికులు అమ్మ‌కానికి లేరంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అన్యాయం చ‌ట్టం అయిన‌ప్పుడు ప్ర‌తిఘ‌ట‌నే క‌ర్త‌వ్యం అవుతుందంటూ నినాదాలు చేశారు. ఈ నిర‌స‌న‌ల‌పై వైట్ హౌస్ స్పందించింది. ఇదే ప్ర‌జా ఉద్య‌మం కాదంటూ కొట్టిపారేసింది.

ఈ నిర‌స‌న‌ల‌న్నీ కేవ‌లం వామ‌ప‌క్షాల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ట్లు పేర్కొంది. న్యూయార్క్ వంటి మెట్రో నగరాల నుండి ఐడాహో వంటి చిన్న పట్టణాల వరకు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీ, శాన్ డియాగో వంటి నగరాల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్లకార్డులతో ప్రదర్శనలు (No Kings Protests) చేపట్టారు. అమెరికాలోనే కాకుండా లండన్, పారిస్, రోమ్ నగరాల్లో కూడా ఈ నిరసనలు కొనసాగాయి.

Read Also: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>