కలం, వెబ్‌డెస్క్ : Revanth Reddy Posters | హైదరాబాద్ గాంధీ భవన్ సమీపంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్ల కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై ‘రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన రిపోర్టు కార్డు.. ప్రశ్నిస్తున్న తెలంగాణ’ అనే పేర్లతో గాంధీ భవన్ వద్ద పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్‌లో వారణాసి సినిమాలో విలన్ క్యారెక్టర్ కూర్చొన్న కూర్చిలో రేవంత్ రెడ్డి కూర్చొన్నట్లు ఫోటో పెట్టి పోస్టర్లు తయారు చేశారు. అలాగే, పోస్టర్లో ‘రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలన రిపోర్టు కార్డు.. ప్రశ్నిస్తున్న తెలంగాణ’ ‘కెసిఆర్/కెటిఆర్‌తో రహస్య ఒప్పందం’, ‘రియల్ ఎస్టేట్‌ను నియంత్రించే సోదరులు’ ‘ఢిల్లీకి నెలవారీ హఫ్తా’ లాంటి పలు వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు.
పోలీసుల ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఉద్యోగి డిసెంబర్ 6న ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తరువాత తెలంగాణ బిజెపి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సుమిరన్ కొమర్రాజు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు అజయ్, పార్టీ నాయకుడు తాటిపాముల సాయి కిరణ్ గౌడ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బిజెపి ట్విట్టర్ వేదికగా స్పందించింది. రేవంత్ రెడ్డి పోస్టర్లు (Revanth Reddy Posters) పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా అరెస్టు చేసిందని విమర్శించింది. ‘భారతదేశంలో ఎమర్జెన్సీ మనస్తత్వం ఇప్పటికీ సజీవంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ సత్యాన్ని నిగ్రహించుకోలేక.. నిరంకుశంగా వ్యవహరిస్తోందని’ అని విమర్శించింది.
Read Also: గ్లోబల్ సమ్మిట్‌కు క్రీడా దిగ్గజాలు
Follow Us On: Instagram


