కలం, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బైక్‌లపై వెళ్తూ హెల్మెట్ లేకపోవడంతో ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” నినాదంతో మెదక్ (Medak)జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అలైవ్ – ఆరైవ్‌లో భాగంగా నార్సింగి మండలం వల్లభాపూర్ (Vallabhapur) గ్రామాన్ని రోడ్డు భద్రతలో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం స్థానిక ఎస్ఐ బీమరి సృజన, సర్పంచ్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ వెంకట రాజు గౌడ్, మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణా రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణా రెడ్డి తన సొంత నిధులతో గ్రామస్థులకు హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఇటీవల గ్రామాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, హెల్మెట్ ధరించపోవడంతో చాలామంది చనిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు వల్లభాపూర్‌ను (Vallabhapur) ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా హెల్మెట్ లేనిదే గ్రామంలో ప్రవేశం లేదని, అందుకే హెల్మెట్లు పంపిణీ చేశామని, ప్రతి గ్రామస్థుడు విధిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే గ్రామస్థాయిలో జరిమానా విధిస్తామన్నారు. గ్రామస్థుల క్షేమం కోసం తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పారు. హెల్మెట్ ప్రాముఖ్యత, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కోసం హెల్మెట్లు పెట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు.
Read Also: అనుకున్నదొక్కటి.. మోడీ ప్లాన్ ఢమాల్..
Follow Us On: X(Twitter)

