Mobile Popup Ad
Mobile Popup Ad

‘మహిళా’ బిల్లు వెనుక బీజేపీ కుటిల రాజకీయం : సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో : దేశాన్ని విభజించి పాలించాలనే దుర్బుద్ధితోనే బీజేపీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (SUDA Chairman Narender Reddy) మండిపడ్డారు. ఆదివారం అర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేలా డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని, కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే వారి అసలు లక్ష్యమని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఈ అన్యాయాన్ని తమ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలన్న బీజేపీ కుట్రలను ప్రజలు ముఖ్యంగా మహిళాలోకం గమనించాలని ఆయన కోరారు.

12 సంవత్సరాలుగా పార్లమెంటులో ఏ బిల్లు వీగిపోలేదని, మహిళాబిల్లు విషయంలో కుట్ర జరిగిందన్నారు. ఇప్పటికైనా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించాలని, సోమవారం మళ్లీ కేవలం మహిళా బిల్లు (Women Reservation Bill) తీసుకురావాలని డిమాండ్ చేశారు. తగుల బెట్టాల్సింది ఇండియా కూటమి దిష్టి బొమ్మలు కాదని, మహిళా బిల్లు పట్ల కుట్రలకు పాల్పడ్డందుకు బీజేపీ నాయకుల దిష్టి బొమ్మలనే తగల బెట్టాలని నరేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) వైఖరిని ఎండగడుతూ స్థానిక సమస్యలను గాలికొదిలేసి కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు.

కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ది చేకూరే విధంగా డీలిమిటేషన్ బిల్లు పెడితే దాన్ని సమర్థిస్తే భవిష్యత్ తరాలు క్షమించవన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అహంకార పూరిత వ్యాఖ్యలు మానుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చిటుక వేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కేటిఆర్ అహంకారాన్ని రెండు నిముషాలలో దించుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజ శేఖర్, పిట్టల రవీందర్, కార్పొరేటర్లు మల్లిఖార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, కాంతాల జగన్ రెడ్డి, పర్వతం మల్లేశం, గుమ్మడి రాజ్ కుమార్ నాయకులు టేల భూమయ్య, ఇక్రమ్, దండి రవీందర్, పెద్దిగారి తిరుపతి, మాసుం ఖాన్, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also:  అనుకున్నదొక్కటి.. మోడీ ప్లాన్ ఢమాల్..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>