నో హెల్మెట్.. నో ఎంట్రీ: గ్రామస్తుల కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : రహదారి భద్రతపై అవగాహన కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఒక గ్రామమంతా ఏకమై తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను మహబూబాబాద్ జిల్లా వెంకట్రాంపురం (Venkatrampuram) గ్రామ పంచాయతీ కఠినతరం చేసింది. హెల్మెట్ లేని వాహనదారులకు తమ గ్రామంలోకి ప్రవేశం లేదంటూ ఏకంగా గ్రామ పొలిమేరలో బ్యానర్లు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేసింది.

ఇటీవల పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారి భద్రతా అవగాహన సదస్సు గ్రామస్తుల్లో మార్పును తీసుకువచ్చింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని గుర్తించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఈ మేరకు కీలక తీర్మానం చేసింది. కేవలం అవగాహనతో ఆగిపోకుండా, నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చొరవతో ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్‌ను విధిగా ధరించేలా ప్రోత్సహిస్తూ వెంకట్రాంపురం (Venkatrampuram) గ్రామం ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పోలీసుల సూచనలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామస్థులు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: పెరిగిన ఈవీ క్రేజ్.. కానీ అసలు సవాల్ ఇదే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>