ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి నుంచి రేషన్ పంపిణీ

కలం/ఖమ్మం బ్యూరో: దేశ వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఏప్రిల్, మే, జూన్ నెల రేషన్ ఈ నెలలోనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగా నేటి నుంచి రేషన్ పంపిణీ చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో కూడా బుధవారం నుంచి రేషన్ పంపిణీ ప్రారంభించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో సుమారు 748 రేషన్ షాపులు ఉన్నాయి. అలాగే సుమారు 4.50 లక్షల వరకూ రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక భద్రాద్రి కొత్తగూడెం  (Bhadradri Kothagudem) జిల్లాలో 3.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 440 వరకూ రేషన్ షాపులు ఉన్నాయి. అంటే ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో దాదాపు 8 లక్షల కుటుంబాలు మూడు నెలల రేషన్ అందుకోనున్నారు. కాగా, 2025 ఏప్రిల్ నుంచి తెలంగాణలోని చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also: 290 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేయడం గర్వకారణం: భట్టి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>