పెరిగిన ఈవీ క్రేజ్.. కానీ అసలు సవాల్ ఇదే!

కలం, తెలంగాణ బ్యూరో: Electric Vehicles | 2020లో కరోనా..! తుమ్మొచ్చినా.. దగ్గొచ్చినా.. ఆటోమేటిక్‌‌‌‌గా నోటికి అడ్డంగా చెయ్యి వెళ్లేలా మార్పు తెచ్చింది! శుభ్రత నేర్పింది.. నో షేక్ హ్యాండ్స్ అంటూ పాఠం చెప్పింది!! ఆరోగ్య సూత్రాలు నేర్పింది. లైఫ్ స్టైల్ మార్చేసింది. ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు.

ఇప్పుడు ఇరాన్ వార్..!

కొత్త పాఠాలు నేర్పుతున్నది. కండ్ల ముందు కనిపిస్తున్న గ్యాస్, పెట్రోల్-డీజిల్ కొరత, పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఊడుతున్న ఉద్యోగాలు.. ఇలాంటి ఇబ్బందులన్నీ జనాన్ని కొత్త ఆలోచనల వైపు మళ్లించింది. కట్టెల పొయ్యి వెలిగితేనే ఇంట్లోగానీ, రెస్టారెంట్లలోగానీ ఫుడ్డు రెడీ. ఇండక్షన్ స్టవ్‌‌‌‌లకు ఎప్పుడూ లేనంత గిరాకీ పెరిగింది. నిత్యం వాడే పెట్రోల్ బైకులు, డీజిల్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు) వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు ఈవీలకు ఫుల్ డిమాండ్.

పాలసీలు ఓకే.. పనితనమెంత?

గతంలో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఎంత చెప్పినా.. ఎన్ని రాయితీలు ఇచ్చినా.. పబ్లిక్ పెద్దగా పట్టించుకోలేదు. పెట్రోల్, డీజిల్ బాధలు తప్పుతాయని తెలిసినా.. ఆలోచించినవారు అరుదు. కానీ.. ఇరాన్ యుద్ధ ప్రభావంతో పుట్టుకొచ్చిన పెట్రోల్, డీజిల్ ఇక్కట్లు ఇప్పుడు ఆ వైపుగా ఆలోచింపజేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈవీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధివిధానాలను రూపొందిస్తున్నాయి. తెలంగాణలో 2014లోనే ప్రత్యేక పాలసీ వచ్చింది. ఇప్పుడు దాన్ని మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈవీల వాడకానికి ఆసక్తి పెరుగుతున్నా వాటి పనితనంపై అనేక అనుమానాలు. పర్యావరణ హితం, రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోవడం, పెట్రోలు-డీజిల్‌‌‌‌తో పోలిస్తే ఖర్చు తక్కువ.. ఇలాంటివి ఉపశమనమే అయినప్పటికీ, వాహనాల కాస్ట్, బ్యాటరీ, మైలేజీ, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, పవర్ ప్రొడక్షన్.. లాంటి సమస్యలు సవాలుగా మారుతున్నాయి.

ఈవీల గురించి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా పాలకులు వాటిని వాడుతున్నారా?.. ఈవీలతో అదనంగా ఒనగూరే ప్రయోజనాలేంటి?.. మైలేజ్ ఎంత ఇస్తుంది?.. బ్యాటరీ రీ-చార్జింగ్‌‌‌‌లో సమస్యలేంటి?.. ఎండాకాలం, వానాకాలంలో ఎదురయ్యే సవాళ్లేంటి?.. ఇప్పటికే వాడుతున్నవారి ఫీడ్‌‌‌‌బ్యాక్ ఏంటి? లాంగ్ జర్నీకి ఈవీ కార్లు పనికొస్తాయా?.. పెట్రోల్ బంకుల తరహాలో చార్జింగ్ స్టేషన్లు ఉంటాయా?.. జిల్లాల్లోని రోడ్లకు అనువుగా ఉంటాయా?.. వీటిపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Electric Vehicles
Electric Vehicles

Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>