కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తరువాత సీనియర్ నేత, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి (Jeevan Reddy) సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినందునే సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఏ కూటమితో సంబంధాలు పెంచుకుంటున్నాడు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ కు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెలంగాణకు రేవంత్ రెడ్డిని సామంత రాజుగా నియమించిందని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టమేనని ఆయన అంచానా వేశారు.
ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పోవాలి కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. 20 నెలలుగా తనను కాంగ్రెస్ ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని.. అందుకే స్వేచ్ఛ కోరుకున్నానని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమ నేత.. జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చారని జీవన్ రెడ్డి (Jeevan Reddy) కొనియాడారు. కానీ, రేవంత్ ఆ బ్రాండ్ ను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చెడగొట్టాడని ఆరోపించారు. మళ్లీ తెలంగాణకు ఆ గుర్తింపుతో పాటు ప్రజల కోసం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. జగిత్యాల బీఆర్ఎస్ సభకు ఆటంకాలు కలిగించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విమర్శించారు. సభ ప్రకటించగానే రెండు సంవత్సరాలుగా పట్టించుకోని హైవేని తవ్వి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది: ఎంపీ కడియం కావ్య
Follow Us On : WhatsApp

