నిజామాబాద్ గుప్త నిధుల పూజ‌లో షాకింగ్ ట్విస్ట్‌!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగర నడి బొడ్డున గుప్త నిధుల తవ్వకం అని హడావుడీ అయిన విషయం మలుపు తిరిగి కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.. అవి గుప్త నిధుల తవ్వకాలు కాదని ఆ స్థల యజమాని రేంగి లక్ష్మి స్పష్టం చేశారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యిందని, దాని కోసం పనులు ప్రారంభించే సమయంలో చేసిన దేవుళ్ల‌ పూజ అని ప్రకటించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్లమ్మ గుట్టకు చెందిన లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రెస్ క్లబ్ లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తాము ఎలాంటి గుప్త నిధుల పూజలు చేయలేదని, తనకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందని, అందుకోసం పనులు ప్రారంభించేందుకు పూజ చేసుకున్నామని స్పష్టం చేశారు. ఇల్లు నిర్మాణం కోసమే పూజలు చేసుకున్నామన్నారు. అయితే త‌మ‌ పట్టాను కొందరు అమ్మాలని అడిగారని, దానికి తాను వ్యతిరేకించినందుకు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన‌ చర్యలు తీసుకోవాలని లక్ష్మి డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>