నిజామాబాద్ బాల్యవివాహ రహిత జిల్లాగా నిలవాలి : మెజిస్ట్రేట్ కుశుబు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని నిజామాబాద్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మిస్ కుశుబు అన్నారు. జస్ట్ ఫర్ రైట్స్ న్యూ ఢిల్లీ అధ్యక్షుడు భవన్ సౌజన్యంతో సాధనా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాలో బాల్య వివాహ నిరోధ రథయాత్ర 100 రోజుల కార్యక్రమం ఫిబ్రవరి 17న ప్రారంభమై గురువారం ముగిసిందని తెలిపారు. నిజామాబాద్ కోర్టు సముదాయంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం ఎదుట బాల్య వివాహ నిరోధ రథయాత్ర ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రథయాత్రను నిర్వహించినట్టు సాధనా స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ డి.వినేష్ కుమార్ తెలియజేశారు.

ఇందల్ వాయి మండలంలోని 23 గ్రామాలు, డిచ్ పల్లి మండలంలోని 20 గ్రామాలు, కోటగిరి మండలంలో 8 గ్రామాలు, పొతంగల్ మండలంలోని 5 గ్రామాలు, వర్ని మండలంలోని 5 గ్రామాలు, రుద్రూర్ మండలంలోని 5 గ్రామాలతో కలిపి 64 గ్రామాల్లో రథయాత్ర చేసినట్టు వినేష్ కుమార్ వెల్లడించారు. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులను తెలియజేశామన్నారు. రథయాత్రకు మంచి ప్రచారం కల్పించిన మీడియా మిత్రులకు, జిల్లా, మండల స్థాయి అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రథయాత్ర ముగింపు రోజున చక్కని ప్రతిభను కనబరిచిన 8 మంది మహిళలకు సన్మానించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా బాధ్యులు రాజకుమార్ సుబేదారి, డిఎల్ ఎస్ ఎస్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>