కేవలం జీతం కోసమే కాదు.. శాలరీ అకౌంట్‌తో ఇన్ని లాభాలా!

కలం, వెబ్ డెస్క్: ప్రతి నెలా జీతం పడగానే బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ ఉద్యోగస్తులకు చాలా సంతోషాన్నిస్తుంది. చాలా ఆర్థిక చిక్కులు వీడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ చాలా మంది ఉద్యోగస్తులు శాలరీ అకౌంట్ (Salary Account)  అంటే.. కేవలం జీతం వేసే వెలుసుబాటు కోసం సంస్థలు ఏర్పాటు చేసిన ఖాతాగానే చూస్తారు. అయితే సాధారణ సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే బ్యాంకులు శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఎనిమిది రకాల ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ఆ అదనపు ప్రయోజనాలపై ప్రతి ఉద్యోగి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం.

శాలరీ అకౌంట్లపై బ్యాంకులు సాధారణం కంటే ఎక్కువగా, అంటే దాదాపు 3 నుంచి 7 శాతం వరకు ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. వీటిలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ సున్నా ఉన్నా బ్యాంకులు ఎలాంటి జరిమానా విధించవు. అంతేకాకుండా, సొంత బ్యాంకు ఏటీఎంలలో అపరిమితంగా, ఇతర బ్యాంకుల్లో నెలకు 5 నుండి 10 సార్లు ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్‌లైన్ లావాదేవీలు , చెక్ బుక్స్ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు.

రుణాలపై రాయితీలు, బీమా:

మీరు శాలరీ అకౌంట్ (Salary Account) ఉన్న బ్యాంకులోనే హోమ్, కార్ లేదా పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లలో ప్రత్యేక రాయితీ లభిస్తుంది. లోన్ ప్రాసెసింగ్ ఫీజులో కూడా మినహాయింపు ఉంటుంది. మరీ ముఖ్యంగా, చాలా బ్యాంకులు ఖాతాదారులకు రూ. 1 లక్ష నుండి రూ. 20 లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమాను అందిస్తాయి. దీని కోసం మీరు పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

అదనపు ఆఫర్లు:

అత్యవసర సమయాల్లో మీ జీతం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ మొత్తాన్ని ‘ఓవర్‌డ్రాఫ్ట్’ రూపంలో తక్కువ వడ్డీకే పొందే వెసులుబాటు ఉంటుంది. వీటితో పాటు ఉచిత డీమ్యాట్ ఖాతాలు, లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు , బ్యాంక్ లాకర్ అద్దెపై 25 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. డెబిట్ కార్డులపై వచ్చే క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు అదనం. ఈ ప్రయోజనాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీ బ్యాంకు అందించే సేవలను సరిచూసుకోవడం మంచిది.

Read Also: ఈ టిప్స్ ఫాలో అయితే గ్యాస్ వాడకం 50 శాతం తగ్గించుకోవచ్చు

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>