కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి (Yadadri) లక్ష్మీనృసింహా స్వామిని తెలంగాణ (Telangana) కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం గురువారం ఉదయం యాదగిరిగుట్ట (Yadagirigutta) కు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
స్వామి వారి గర్భాలయంలో లక్ష్మీనృసింహా స్వామి, అమ్మవార్లకు గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత వారికి ఆలయ ఈవో భవానీ శంకర్ స్వామివారి జ్ఞాపికతోపాటు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. గవర్నర్ రాక సందర్భంగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

