కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ప్రతికూల వాతావరణ పరిస్థితులపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై ప్రభావం, తాగునీటి లభ్యత, పశుగ్రాసం, సాగునీటి నిర్వహణ, ప్రజలకు అవసరమైన ముందస్తు చర్యలు, అత్యవసర ప్రణాళికల అమలుపై విస్తృతంగా సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన ముందస్తు చర్యలను వేగవంతంగా అమలు చేయాలని సమావేశంలో అధికారులు నిర్ణయించారు.
Read Also: రాహుల్ గాంధీపై మోదీ సెటైర్లు.. 56 ఏళ్ల యువకుడు అంటూ..
Follow Us On: Sharechat

