కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. భారత అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల విజయాలను ప్రశంసిస్తూ మాట్లాడిన ఆయన, స్కైరూట్ ఏరోస్పేస్ బృందాన్ని అభినందించారు.
ఆ సంస్థ సభ్యుల సగటు వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని యువ శాస్త్రవేత్తల ప్రతిభను కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. “నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు” అంటూ మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
యువత సాధించిన విజయాలు అసామాన్యమని ప్రధాని మోదీ కొనియాడారు. భారత యువత ప్రతిభ, సామర్థ్యానికి అంతరిక్షమే హద్దు అని ప్రపంచానికి నిరూపించారని చెప్పారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తోందని, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో భారత యువశక్తి కొత్త శకానికి నాంది పలుకుతోందని పీఎం వెల్లడించారు.
Read Also: మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారు: ఖర్గే
Follow Us On: Instagram

