నిర్మల్ BJYM సారథిగా నిరంజన్ రెడ్డి

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన దొడ్డికింది నిరంజన్ రెడ్డి(Doddikindi Niranjan Reddy) భారతీయ జనతా యువ మోర్చా (BJYM) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాల మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే జిల్లా అధ్యక్షుల జాబితాను విడుదల చేయగా, అందులో నిర్మల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను నిరంజన్ రెడ్డికి అప్పగించారు.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి (Doddikindi Niranjan Reddy) మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా యువతను మరింతగా సంఘటితం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.

అలాగే పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నిరంజన్ రెడ్డి నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి ఆయన సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

Read Also: హైద‌రాబాద్‌లో ఇందిర‌మ్మ ఎల్ఐజీ ఇళ్ల‌కు శ్రీకారం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>