కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కింది: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

కలం, జడ్చర్ల: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న వంటా వార్పు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి (Laxma Reddy) ఆధ్వర్యంలో మూడో రోజు జడ్చర్ల (Jadcherla) పట్టణంలోని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో వంటా వార్పు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మారెడ్డి (Laxma Reddy) మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేసింది ఏమీ లేదని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులు, ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఎంతో ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని వీరుల పాలన అని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.

వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తూ ప్రభుత్వం కొనసాగిస్తున్న సర్కారుకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల గురించి క్షుణ్ణంగా ఆలోచించి సర్వే నిర్వహించి ఎవరెవరికి ఏమి అవసరం ఉందో తెలుసుకుని ఆ విధంగా ముందుకు సాగారని అలా పదిహేనులో పాటు పాలన సజావుగా సాగిందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పుడు ఎలక్షన్‌లో పెట్టిన కేసీఆర్ ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం గోడ ఫంక్షన్ హాల్ చేరుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్‌‌‌కు కాంగ్రెస్ షాక్.. మహా ధర్నాకు సిద్ధం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>