కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిజామాబాద్ (Nizamabad) జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. CPI(ML) మాస్ లైన్ జిల్లా నాయకులు డి.కిషన్, బి.మురళి, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వి.సాయినాథ్ లను అరెస్టు చేసి డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందస్తు పేరుతో చేస్తున్న ఈ అక్రమ అరెస్టులను TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ ఖండించారు. ప్రజా పాలన అంటే పౌరహక్కులను హరించడం , ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం కాదన్నారు. ముందస్తు పేరిట అరెస్టులు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని పిలుపునిచ్చారు.

