నిజామాబాద్‌లో గవర్నర్ సందడి.. ఎంపీ అరవింద్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నేడు నిజామాబాద్ ( Governor Nizamabad Visit) లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద గవర్నర్ కు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌, ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆర్మూర్‌ ఎమ్మెల్యే పి. రాకేష్‌ రెడ్డి, , కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ పి. సాయి చైతన్యలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గవర్నర్ భూమారెడ్డి కన్వెన్షన్ లో జరిగే యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంతో పాల్గొనడానికి వెళ్లారు. ఆ తర్వాత పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో భేటీ అవుతారు. ఆపై ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎంపీ అరవింద్ కు గవర్నర్ స్పెషల్ విషెస్

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ బర్త్ డే నేడు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన గవర్నర్ కు ఎంపీ ధర్మపురి ఘన స్వాగతం పలికిన వేళ.. గవర్నర్ ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. అందరి సమక్షంలోనే జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. దీంతో ఎంపీ అరవింద్ సంతోషపడుతూ గవర్నర్ శుక్లా చేతులు పట్టుకొని కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి ఆర్ బి అతిథి గృహానికి వెళ్లిన గవర్నర్ పోలీసుల గౌరవ వందకం స్వీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>