వంశధార కాల్వలో కారు బోల్తా.. ఇద్దరు దుర్మరణం

కలం, వెబ్ డెస్క్: శ్రీకాకుళం (Srikakulam) జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ సమీపంలో విషాదం జరిగింది. వంశధార ఏడో కాల్వలో ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నీటిలో మునిగిపోయింది. వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో సీపాన రాము (50), మెండ విశాల్ కుమార్ (26) వ్యక్తులు మరణించారు.

అయితే ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే డ్రైవర్ గొటివాడ నాగరాజును ఒడ్డుకు చేర్చారు. దీంతో డ్రైవర్ గొటివాడ నాగరాజు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>