Mobile Popup Ad
Mobile Popup Ad

‘పెద్ది’ మూవీ వాయిదా.. అదే అసలు కారణం!

కలం, వెబ్ డెస్క్: రామ్ చరణ్–బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ (PEDDI) మూవీ ఏప్రిల్‌ నుంచి ఏకంగా జూన్ నెలకు వాయిదా పడటం వెనుక.. షూటింగ్ ఆలస్యమే కాదు.. ఐపీఎల్ ప్రధాన కారణమని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సినిమాల విడుదలకు వేసవిని మించిన సీజన్ మరొకటి ఉండదని అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. జూన్ వచ్చేసిందంటే.. విద్యాసంస్థలు ప్రారంభమవుతుంటాయి. దీంతో, అందరూ ఆ హడావిడిలోనే మునిగిపోతుంటారు. అందుకే అగ్ర హీరోలు సమ్మర్ నే టార్గెట్ చేసి సినిమాలు విడుదల చేస్తుంటారు. అయితే, ఐపీఎల్‌ క్రేజ్ పెరిగిపోవడంతో ఇండస్ట్రీపై దెబ్బ గట్టిగానే పడుతోంది. హిట్‌ టాక్ వచ్చిన మూవీలు సైతం వసూళ్ల పరంగా తేలిపోతున్న పరిస్థితి.

వారాంతాల్లోనే క్రేజీ మ్యాచ్‌లు.

పెద్ది (PEDDI) మూవీని ఈ నెలలోనే విడుదల చేద్దామని ముందు భావించినా.. ఐపీఎల్ ధాటికి కలెక్షన్లపై ప్రభావం పడుతుందేమోనని మేకర్స్ ఆలోచించి.. జూన్ నెలకు పోస్ట్ పోన్ చేశారట. ఒకప్పుడు అన్ సీజన్ గా ఉన్న జూన్ నెలనే.. ఇప్పుడు అసలైన సీజన్ అనే మాట వినిపిస్తోంది. పైగా, ఐపీఎల్ ప్రభావం గ్రాస్ కలెక్షన్లపై ప్రభావం చూపడటంతో.. వాటి ఓటీటీ అమ్మకాలు కూడా ఆశించినంత జరగడం లేదు. దీంతో, ఒకప్పుడు ఏప్రిల్, మే నెలలు సినిమాలతో సందడిగా ఉంటే.. ఐపీఎల్ రాకతో ఆ పరిస్థితి లేకుండా పోయిందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>