నిజామాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఖలీల్ వాడీలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న 19 ఏళ్ల ఓ విద్యార్థిని నిద్ర మాత్రలు తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన రూమ్ మేట్స్ వెంటనే 108 ద్వారా జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు కూడా వచ్చారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

Read Also: తెలంగాణ రేవంత్ జాగీరా? : ఎంపీ అర్వింద్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>