కలం, నిర్మల్ : ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈనెల 10న హైదరాబాద్ లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ (Nirmal TNGO) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీని అమలు చేసి, ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. 70 డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న మహాధర్నాలో ప్రతి ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

