నిజామాబాద్ లో ఘనంగా జగదాంబ సేవాలాల్ ఉత్సవాలు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతం, ఇందిరా ప్రియదర్శిని కాలనీలో నూతనంగా నిర్మించిన ఇందూర్ ఘడ్ శ్రీ జగదాంబ – సేవాలాల్ మహారాజ్ (Jagadamba Sewalal Maharaj) దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు.

సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందేందుకు దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జగదాంబ తల్లి, సేవాలాల్ మహారాజ్ కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ మహోత్సవ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య వైభవంగా జరిగాయి. మూడు రోజుల పాటు యాగశాల కార్యక్రమాలు, హోమాలు, ప్రత్యేక పూజలు ఆపై చివరి రోజు విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ఠ, పంచామృతాభిషేకం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాలు జరిగిన ప్రతిరోజూ భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, రమేష్, కార్పొరేటర్లు శశాంక్ రెడ్డి, నాగోల్ల లక్ష్మి నారాయణ గారు, జ్యోతి మురళి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: రాష్ట్రపతి టూర్ వివాదం.. పాత ఫోటోతో మోడీకి మమత కౌంటర్

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>