పాత రూపాయి నోటుకు ఉచితంగా బూట్లు.. ఎగబడ్డ జనం, చివరకు ఏమైందంటే!

కలం, వెబ్ డెస్క్: తమ ప్రోడక్ట్స్‌ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చాలామంది వ్యాపారులు ఉచితంగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అమలుకు ఆచరణ కాని ఆఫర్లను ప్రకటిస్తూ ఇబ్బందులు గురవుతున్నారు. చివరకు జనాగ్రహానికి బలవుతున్నారు. తాజాగా కేరళ (Kerala)లోని కోజికోడ్, మానాంచిరా స్క్వేర్ సమీపంలోని ట్రెండ్ ఫ్యాక్టరీ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన ఆఫర్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. పాత ఒక రూపాయి నోటును తీసుకొచ్చిన మొదటి 100 మందికి ఉచితంగా బూట్లు (Free Shoe) ఇస్తామని ప్రకటించారు.

ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుండే భారీ సంఖ్యలో జనాలు గుమిగూడారు. దీంతో అక్కడ తీవ్ర తొక్కిసలాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గుంపును చెదరగొట్టడానికి స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షోరూం యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ : న్యూజిలాండ్ ప్రధాని ఏమన్నారంటే !

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>