కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలంలోని గోల్నేపల్లి గ్రామంలో ఆదివారం వర్షాలు సమృద్ధిగా కురియాలని, పంటలకు నీటి సమస్య రావద్దని కోరుతూ మహిళలు బొడ్రాయికి నీళ్లు పోసి పూజలు నిర్వహించారు. అంతకు ముందు బొడ్రాయి వద్ద నీటి బిందెలతో మహిళలు వరుణుడి కరుణ కోసం బతుకమ్మ ఆటలు ఆడుతూ, పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నంశెట్టి రాణి మధు, ఉప సర్పంచ్ వెల్దండ కృష్ణ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

