అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ రికార్డ్‌లు ఇవీ!

కలం, వెబ్​ డెస్క్​: టీ20 ప్రపంచకప్ 2026 విజేత ఎవరో తేల్చే మహా సంగ్రామానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Modi Stadium) సిద్ధమైంది. ఈ పిచ్‌పై భారత్‌కు ఉన్న పాత రికార్డులు చూస్తే ఒకవైపు గర్వంగా, మరోవైపు కొంత ఆందోళనగా ఉంది. మరికొద్ది గంటల్లో న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్‌ నేపథ్యంలో ఈ వేదికపై టీమ్ ఇండియా ప్రస్థానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ స్టేడియంలో భారత్ రికార్డు టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఆడిన 10 మ్యాచ్‌ల్లో భారత్ 7 విజయాలు సాధించింది. కేవలం మూడింట్లో మాత్రమే ఓడిపోయింది. 70 శాతం విజయాల రేటుతో టీమ్ ఇండియా ఇక్కడ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా 2023లో ఇదే వేదికపై న్యూజిలాండ్‌ను 168 పరుగుల భారీ తేడాతో ఓడించడం భారత్‌కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే అంశం.

కీలక మ్యాచ్‌లలో ఓటమి

వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో కూడా భారత్(Team India) ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేసింది. 21 వన్డేల్లో 12 విజయాలు, 16 టెస్టుల్లో 7 విజయాలను నమోదు చేసింది. అయితే, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇక్కడే ఓటమి పలకరించింది. ఇది అభిమానులను ఇంకా వెంటాడుతోంది. అలాగే, ప్రస్తుత టోర్నీ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఇక్కడే పరాజయం పాలైంది.

పిచ్ ఎలా ఉండబోతోంది?

నేటి ఫైనల్ కోసం ఎర్ర మట్టి, నల్ల మట్టి కలిపిన మిశ్రమ పిచ్‌ సిద్ధం చేశారు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలించడమే కాకుండా, పేసర్లకు మంచి బౌన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వేదికపై మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 7 సార్లు గెలవగా, ఛేజింగ్ చేసిన జట్లు కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించాయి.

కివీస్ మాజీ పేసర్ ఏమన్నాడంటే..

అహ్మదాబాద్ వేదిక(Modi Stadium) భారత్‌కు మానసిక సమస్యగా మారుతుందన్న వాదనను న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ కొట్టిపారేశాడు. భారత్ ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఓడిపోయిందనే గణాంకాలను ఆ జట్టు పట్టించుకోదని ఆయన అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్లు ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ రాణిస్తారని, కివీస్ కూడా భారత్‌కు ఉన్న వేదిక సమస్యలను సొమ్ము చేసుకోవాలని చూడటం లేదని ఆయన పేర్కొన్నాడు. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ ఓటముల చర్చ కూడా ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేశాడు.

Read Also: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ : న్యూజిలాండ్ ప్రధాని ఏమన్నారంటే !

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>