కలం, వెబ్ డెస్క్: రాష్ట్రపతి ముర్ము (President Murmu) పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని, ఆమెను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మోడీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2024లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి నిలబడి ఉండగా, ప్రధాని మోదీ కూర్చుని ఉన్న ఫోటోను మమతా బెనర్జీ బయటపెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతిని గౌరవించడం లేదని, రాజకీయాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటోందని ఆరోపించారు.
కాగా, ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ లోపాలపై వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, ముఖ్యమంత్రి, ఇతర అధికారులు హాజరుకాకపోవడం వంటి అంశాలపై నివేదిక కోరుతూ కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. మరోవైపు ఈ ఘటనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించగా, రాష్ట్రపతి పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని టీఎంసీ (TMC) నేతలు తేల్చి చెప్పారు. ఆ కార్యక్రమం ప్రభుత్వ నిర్వహణలో జరిగినది కాదని క్లారిటీ ఇచ్చారు.
Read Also: టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Follow Us On: X(Twitter)

